చీరాల : ఈపురుపాలెం పంచాయతీ పరిధిలోని సీతారామపేటలో వైఎస్సార్ సిపి నియోజకవర్గ ఇంచార్జ్ యడం బాలాజీ ఆధ్వర్యంలో వైసిపి నవరత్నాలను వివరిస్తు గడప గడపకు వైసిపి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. రావాలి జగన్ – కావాలి జగన్ నినాదంతో వైసిపి కార్యకర్తలు గ్రామంలో ఇంటింటికి తిరిగి వైసిపి పథకాలను వివరించారు. కార్యక్రమంలో బాలాజీ వెంట గోలి వెంకటరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గుద్దంటి సుధాకర్, ఎంపిటిసి గోలి ఆనందరావు, అధికార ప్రతినిధి యడం రవిశంకర్ పాల్గొన్నారు.