Home ప్రకాశం జెకెసి సర్టిఫికెట్లు పంపిణీ

జెకెసి సర్టిఫికెట్లు పంపిణీ

6
0

అద్దంకి (DN5 News) : పట్టణంలోని కెఆర్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జి సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేల్పుల మోహనరావు అధ్యక్షతన సెమినార్ హాల్లో ఘనంగా బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెకెసి ద్వారా అందించే కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, జనరల్ అవేర్నెస్ వంటి అంశాలపై శిక్షణ విద్యార్థుల భవిష్యత్తుకు అదనపు అర్హతగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ నైపుణ్యాల వల్ల విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉపాధి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. కళాశాల జెకెసి కో ఆర్డినేటర్ డాక్టర్ ఎన్ షర్మిలారాణి మాట్లాడుతూ జెకెసి ద్వారా కేవలం శిక్షణ మాత్రమే కాకుండా విద్యార్థులకు ప్రత్యేకంగా జాబ్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ అల్లడి శిఖామణి, మెంటార్ వినుకొండ రమేష్ పాల్గొని ఇటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.