అద్దంకి (DN5 News) : ధరిత్రి దినోత్సవం సందర్భంగా రెడ్డిపాలెం జెడ్‌పి ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు బుధవారం నిర్వహించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ ప్రెసిడెంట్ బాచిన శివధర పూర్ణచంద్రరావు మాట్లాడుతూ భూమి పుట్టుక దాని ప్రాముఖ్యత, భావితరాలకు దానిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత వివరించారు. విజేతలైన విద్యార్ధులతోపాటు పోటీలో పాల్గొన్న విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు చప్పిడి వీరయ్య, మహాలక్ష్మిరెడ్డి, పాఠశాల హెచ్‌ఎం అర్జున్, లక్కరాజు శ్రీనివాసరావు, పద్మావతి, విజయ్ కుమార్, సురేష్ పాల్గొన్నారు.






