దర్శి (DN5 News) : కమ్యూనిస్టుల ప్రజా పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం ఆవుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి కొండారెడ్డి అన్నారు. స్థానిక సుందరయ్య భవన్‌లో రెండు రోజులపాటు జరిగే సిపిఎం నియోజకవర్గ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం 33శాతం చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే డీలిమిటేషన్ బిల్లుతో కలిపి పెట్టిందని అన్నారు. మెజారిటీ లేని బిజెపి కనీసం ప్రతిపక్షాలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించలేదని అన్నారు. ఇప్పుడు ముసలికన్నీరు కార్చుతున్నారని విమర్శించారు.
డిల్లీ వద్ద నోయిడాలో కార్మికులకు వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తుంటే కేసులు పెట్టి అరెస్టులు చేసి నిర్భంధం ప్రయోగిస్తున్న బిజెపి ప్రభుత్వం తీరును ఖండించాలని అన్నారు. డిల్లీ నగరంలో రూ.11 వేల వేతనంతో ఎలా జీవిస్తారని నిలదీశారు. మోదీ తెచ్చిన లెబర్ కోడ్స్ అమలు చేయడం వలన ఉద్యోగ, కార్మికుల పోరాటాలు భవిష్యత్తులో పెరుగుతాయని అన్నారు. కమ్యూనిస్టులు ప్రజా సమస్యల పరిష్కరం కోసం ముందు ఉండాలని అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారి సమాజానికి నాయకుడిగా ఉన్న ట్రంప్, అమెరికా సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. దాని నుంచి బయట పడటం కోసం ఇరాన్‌పై యుద్దం ప్రకటించి ప్రపంచం ముందు నవ్వుల పాలైందని అన్నారు.
అమెరికాకు మోదీ ప్రభుత్వం దాసోహమైందని ఆరోపించారు. రష్యా నుంచి అయిల్ దిగుమతి అమెరికా చేసుకోమంటే చేసుకోవడం, లేకపోతే అపడం జరిగిందని, దేశంలో నిరుద్యోగం పెరగడం, నిత్యావసర ధరలు పెరగడం, నిజవేతనాలు తగ్గడం, రైతులకు గిట్టుబాటు ధరలు లేక పోవడంతో ప్రజలు అప్పులు పాలౌతున్నారని అన్నారు. ఈ దోపిడి పాలనకు వ్యతిరేకంగా సిపిఎం కార్యకర్తలు పోరాడాలని కోరారు. ఈ రోజు వర్తమాన రాజకీయాలు, సిపిఎం మహాసభల తీర్మానాలు, ‘బిజెపి – హిందూత్వ ప్రమాదం అంశాలపై కొండారెడ్డి, షేక్ మాబు వివరించారు. తరగతులకు కెవి పిచ్చయ్య ఫిన్సిపల్‌గా వ్యహారించారు. దొనకొండ, దర్శి, ముళ్ళమూరు, కురిచేడు మండలాల నాయకులు సందు వెంకటేశ్వరరావు, కుందుర్తి చిన్న నరశింహులు, కర్నా క్రిష్ణ, ఉప్పు నారాయణ, గర్నిపూడి జాన్ సామ్యేల్, పంటా ఏడుకొండలు, టి లక్ష్మీ, రంగమ్మ, షేక్ కాలేభాషా, గోగు వెంకయ్య, యలమందారెడ్డి, యోహోషువా, కంఠా వెంకటరావు పాల్గొన్నారు.






