Home బాపట్ల జాతీయ జెండాతో శ్రీగౌతమి విద్యార్ధుల ర్యాలీ

జాతీయ జెండాతో శ్రీగౌతమి విద్యార్ధుల ర్యాలీ

6
0

చీరాల (DN5 News) : రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో వైబ్రెంట్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వెయ్యి కిలోమీటర్ల సైకిల్ యాత్ర విశాఖపట్నంలో బుధవారంతో ముగిసింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కలాం ఏప్రిల్ 6న తిరుపతిలో ప్రారంభించిన యాత్ర రాష్ట్రంలోని పలు జిల్లాల మీదుగా కొనసాగింది. యాత్ర సందర్భంగా అనేక కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. యాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శించారు. ఈ సందర్భంలో దండి మార్చ్ 2.0 ముగింపు కార్యక్రమం చీరాల శ్రీ గౌతమి విద్యా సంస్థలో బుధవారం నిర్వహించారు.

వెయ్యి మంది విద్యార్థులతో 100 మీటర్ల జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత ఎం వెంకటేశ్వర్లు (ఎంవి) మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. మార్పు సంస్థ కార్యదర్శి మార్పు గ్రెగోరి మాట్లాడుతూ యువతలో దేశభక్తి పెంపొందించి, బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈగల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సురేష్‌బాబు, శ్రీగౌతమి విద్యా సంస్థల ప్రిన్సిపల్ రూపస్, సిబ్బంది చి జాన్సన్, బంగారుబాబు, అశోక్, వైబ్రెంట్ ఆఫ్ కలాం నియోజకవర్గ కోఆర్డినేటర్ పారా నాగేశ్వరరావు పాల్గొన్నారు.