Home బాపట్ల బాలికను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన శక్తి టీం

బాలికను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన శక్తి టీం

6
0

చీరాల (DN5 News) : ఒడిశా రాష్ట్రానికి చెందిన పూజ అనే బాలిక కుటుంబ సభ్యులతో పని కోసం ఇంకొల్లు ప్రాంతంలోని ఎన్‌ఎస్‌ఎల్ స్పిన్నింగ్ మిల్లుకు వచ్చి దారి తప్పి చీరాల బస్టాండ్ పరిసరాల్లో తిరుగుతూ బుధవారం కనిపించింది. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు సీహెచ్ సునీత, కె సుబ్బారావు, బి ధనలక్ష్మి ఆమెను గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని చీరాల డీఎస్పీకి తెలియజేశారు. ఆయన సూచనల మేరకు బాలికను పని కోసం పిలిచిన వ్యక్తుల ఫోన్ నంబర్లను సేకరించి వారిని సంప్రదించారు. తరువాత వారిని చీరాలకు పిలిపించి వన్‌టౌన్ మహిళా పోలీసు స్టేషన్ ఎస్‌ఐ జి రాజ్యలక్ష్మి సమక్షంలో పోలీసు స్టేషన్‌లో బాలికను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాలికను సురక్షితంగా గుర్తించి అప్పగించిన శక్తి టీం సభ్యులను పోలీసులు అభినందించారు.