Home బాపట్ల ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి

6
0

చీరాల (DN5 News) : పట్టణంలోని వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజానికి సహకరించాలని సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు కోరారు. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ మోయిన్ సూచనలతో మండలంలోని జాండ్రపేట బివి అండ్ బిఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో అవగాహన కల్పించారు. శక్తి టీం కానిస్టేబుల్ కె సుబ్బారావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని ఒక భారంగా భావించకూడదని అన్నారు. అది ప్రాణరక్షణకు అత్యంత అవసరమని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. వాహన దారులు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలపై విద్యార్థులచే స్కిట్ వేయించి అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారానే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా జిల్లా పరిధిలో ఇటువంటి తనిఖీలు, అవగాహన సదస్సులు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం పి వెంకటేశ్వర్లు, జెవి నాగలక్ష్మి, సిహెచ్ నాగమణి, కె శ్రీనివాస్, వై రాజకుమారి పాల్గొన్నారు.