Home బాపట్ల ఓడరేవు ఎన్నికల ప్రచారంలో ‘ఆమంచి’

ఓడరేవు ఎన్నికల ప్రచారంలో ‘ఆమంచి’

22
0

చీరాల (డిఎన్5) : మండలంలోని ఓడరేవు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి డాక్టర్ సూరిబాబు ఎన్నికల ప్రచారంలో చీరాల మాజీ శాసన సభ్యులు ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. గ్రామంలో ప్రచార సభ నిర్వహించారు. సభలో మాజీ సర్పంచ్ ఏరిపల్లి రమణ మాట్లాడారు. ఆమంచి కృష్ణమోహన్ శాసనసభ్యునిగా ఉన్న కాలంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య సహకారంతో గ్రామంలో మౌలిక వసతుల ఏర్పాటుకు పెద్ద ఎత్తున కృషి జరిగిందని అన్నారు. ఫిష్ లాండింగ్ సెంటర్, సునామీ కాలనీ, గ్రామంలో రోడ్లు, తాగునీటి వాటర్ ప్లాంట్ నిర్మాణం అప్పట్లో చేసినట్లు ఎరిపిండి రమణా చెప్పారు. భవిష్యత్తులోనూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని, గ్రామంలో అందరికీ సుపరిచితులైన డాక్టర్ సూరిబాబును సర్పంచిగా గెలిపించాలని కోరారు. సభలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.