– 95 పంచాయితీల్లో 31 చోట్ల ఏకగ్రీవాలు
– తొలివిడత ముగిసిన నామినేషన్లు
పర్చూరు (DN5 News) : బాపట్ల జిల్లాలో 351 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా మొదటి విడతలో పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోని 95 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 95 పంచాయతీలకు నామినేషన్లు, నామినేషన్ల ఉప సంహారణలు శనివారంతో ముగిశాయి. నియోజకవర్గంలో 31 పంచాయతీల నుంచి సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.పార్టీల రహితంగా పంచాయితీల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అధికార టిడిపి మద్దతు దారులకు పంచాయతీలన్ని ఏకగ్రీవమయ్యాయి. పలు గ్రామాల్లో గ్రామస్తులంతా చర్చించుకుని సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో కూటమి పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపి తోపాటు బలా బలాల ఆధారంగా ప్రతిపక్ష వైసిపికి కూడా కొన్ని గ్రామాలలో వార్డులు కేటాయించి ఏకగ్రీవం చేశారు.
పట్టు నిరూపించుకున్న ‘ఏలూరి’
శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలో తనకున్న పట్టు మరోసారి నిరూపించారు. ఆరు మండలాల పరిధిలో 31 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనకున్న పట్టుకు నిదర్శనం. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకం, విశ్వాసానికి ఈ ఏకగ్రీవ విజయాలు నిదర్శనం అన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో చురుగ్గా వ్యవహరించాలని ఆకాంక్షించారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలు – సర్పంచులు
మార్టూరు మండలం డేగరమూడి సర్పంచి జ్యోతి శ్రీనివాసరావు, నాగరాజుపల్లి సర్పంచి భూక్యా రాజా నాయక్, కొనంకి సర్పంచి కోటపాటి కోమలి, ఇసుకదర్శి సర్పంచి కామేపల్లి పద్మ, రాజుపాలెం సర్పంచి శాకమూరి పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

యద్దనపూడి మండలం గన్నవరం పంచాయతీ సర్పంచి నల్లపనేని వీరమ్మ, మున్నంగివారిపాలెం సర్పంచి దొడ్డ నాగబాబు, యనమదల సర్పంచి కార్లపూడి శ్రీలక్ష్మి, తనుబొద్ధివారిపాలెం సర్పంచి కూరాకుల దయాదాసు ఎన్నికయ్యారు.

పర్చూరు మండలం పర్చూరు సర్పంచి కోడూరి శేష బ్రహ్మచారి, ఇనగల్లు సర్పంచి పారి కోటేశ్వరమ్మ, అడుసుమల్లి సర్పంచి రావి రవీంద్రబాబు, తన్నీరువారిపాలెం సర్పంచి యెందెటి దుర్గాభవాని, తిమ్మరాజుపాలెం సర్పంచి గొరంట్ల రామకృష్ణ, ఉప్పుటూరు సర్పంచి మువ్వ శైలజ, నాగులపాలెం సర్పంచి కొల్లా రజిని, దేవరపల్లి సర్పంచి కొమ్మలపాటి రాధిక, కొల్లవారిపాలెం సర్పంచి జెర్రిపోతుల నాగయ్య, చెన్నుబొట్లవారిపాలెం సర్పంచి గద్దే కోటేశ్వరరావు ఎన్నికయ్యారు.

కారంచేడు మండలం పోతినవారిపాలెం సర్పంచి పోతిన రాధిక, నాయుడువారిపాలెం సర్పంచి గుమ్మడి రామ్మోహనరావు, కొడవలివారిపాలెం సర్పంచి యారం అశోక్, తిమిడితపాడు సర్పంచి దండ సీతామహాలక్ష్మి ఎన్నికయ్యారు.

ఇంకొల్లు మండలం పూసపాడు సర్పంచి కరణం రమేష్, సూదివారిపాలెం సర్పంచి గోరంట్ల హైమావతి, ఇడుపులపాడు సర్పంచి పేర్ని బాపయ్య, భీమవరం సర్పంచి గొల్ల చైతన్య ఎన్నికయ్యారు.

చిన్నగంజాం మండలం సంతరావూరు సర్పంచి ఉప్పుతోళ్ల ఆదిశేషు, నీలాయపాలెం సర్పంచి తుమాటి మాధురిలత, గొనసపూడి సర్పంచి కట్టెం సుసన్న, కడవకుదురు సర్పంచి పొట్లూరి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పర్చూరు మండలం కొత్తపాలెం ఉపసర్పంచ్‌గా టి మంజుల, పర్చూరు ఉప సర్పంచ్‌గా తంగళ్ళ మల్లికార్జున్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరు మండలాల్లో 31 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగిలిన 64 పంచాయతీలకు ఈనెల 26న పోలింగ్ జరగనుంది.






