Home బాపట్ల కరాటేలో ‘సందీప్’ విద్యార్థుల ప్రతిభ

కరాటేలో ‘సందీప్’ విద్యార్థుల ప్రతిభ

12
0

చీరాల (DN5 News) : ఒంగోలులోని ఆచార్య ఎన్‌జి రంగా భవన్‌లో ఆదివారం నిర్వహించిన 2వ ఇంటర్ డోజో షోటోకాన్ కరాటే టోర్నమెంట్‌లో పట్టణంలోని సందీప్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పథకాలు సాధించారు. వివిధ విభాగాల్లో పోటీపడి పతకాలు, బహుమతులు కైవసం చేసుకున్నారు. గ్రూప్‌-ఏ కటా విభాగంలో చిమట గోపీచంద్ ప్రథమ స్థానం, తేజస్ ద్వితీయ స్థానం, గ్రూప్‌-బి కటా విభాగంలో అక్కల కేశవరెడ్డి ప్రథమ స్థానం, కొణిజేటి డుండి ద్వితీయ స్థానం సాధించినట్లు సందీప్ విద్యాసంస్థల చైర్మన్ అండ్ కరస్పాండెంట్ తుళ్లూరి ఉషారాణి తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు శారీరక సామర్థ్యాన్ని పెంపొందించే క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. కరాటే వంటి యుద్ధ కళల్లో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంచుకోవచ్చని అన్నారు. పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ టి వెంకటేశ్వర్లు (టివి) మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించే క్రీడలు, వ్యాయామం, కరాటే వంటి యుద్ధ కళల్లో శిక్షణ అందిస్తున్న సిబ్బందిని అభినందించారు. టోర్నమెంట్‌లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజయాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరాటే ఇన్‌స్ట్రక్టర్ శివప్రసాద్‌ను అభినందించారు.