– హాజరైన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్
– నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం : డాక్టర్ నారాయణ రెడ్డి
చీరాల (DN5 News) : పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఎటిఎన్ఆర్ నారాయణ హాస్పిటల్ ఎండీ డాక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎల్బీఎస్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎటిఎన్ఆర్ నారాయణ హాస్పిటల్ను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హాజరై ఆసుపత్రిలోని పలు విభాగాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తూ ఆసుపత్రి మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. స్థానికంగా అందుబాటులోకి వచ్చిన వైద్య సదుపాయాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ హాస్పిటల్ను సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా హాస్పిటల్ ఎండి డాక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ చీరాల పరిసర ప్రాంతాల ప్రజలు అత్యవసర వైద్యం కోసం గుంటూరు, విజయవాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను తగ్గించాలనే ఉద్దేశంతో అత్యాధునిక వైద్య పరికరాలతో నూతన ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు వివరించారు.
గతంలో బాపూజీ వైద్యశాల భవనంలో నిర్వహించిన ఆసుపత్రిని, మరింత మెరుగైన సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని నూతన భవనంలోకి మార్చినట్లు తెలిపారు. ఆధునిక వైద్య పరికరాలతో పాటు వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. అత్యవసర చికిత్సలతోపాటు సాధారణ ఆరోగ్య సమస్యలు, మధుమేహం తదితర వ్యాధులకు వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ వైద్యులు, ప్రముఖులు, ఆత్మీయులు డాక్టర్ నారాయణరెడ్డిని కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, ప్రముఖులు, ఆసుపత్రి సిబ్బంది పలువురు పాల్గొన్నారు.






