Home బాపట్ల మీ ఇంటి బిడ్డగా ఆదరించండి : ఇస్తర్ల షెర్లి

మీ ఇంటి బిడ్డగా ఆదరించండి : ఇస్తర్ల షెర్లి

16
0

”నేను డాక్టర్‌ను. నాకేమీ తెలియదనుకోవద్దు. ప్రజా సంక్షేమం తెలుసు. పట్టణ ప్రజల అవసరాలు తెలుసు. ఆరోగ్యం కాపాడటం వైద్యురాలిగా నా బాధ్యత తెలుసు. వైద్య విద్యలోనే పర్యావరణం, పారిశుద్యం, ప్రజారోగ్యం వంటి అంశాలు ఒక భాగంగా చదువుకున్నాను. కాబట్టి అవకాశం ఇస్తే పట్టణ ప్రజారోగ్యం ఎలా కాపాడాలో? ఎలాంటి పరిపాలనా చర్యలు తీసుకోవాలో తెలుసు. ప్రజలందరి సాకారంతో ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య బద్దంగా చేయగలను. ముందుగా యువతను ప్రోత్సహిస్తూ అధినేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి, వైసిపి ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌, మాజీ మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జున నాకు అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటాను.” అంటూ వైసిపి ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి డాక్టర్‌ ఇస్తర్ల షెర్లీ పేర్కొన్నారు.
చీరాల (DN5 News) :

వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ ఇస్తర్ల షెర్లిని మీ ఇంటి బిడ్డగా ఆదరించి గెలిపించాలని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ మేరుగ నాగార్జున కోరారు. ఎస్సీ రిజర్వేషన్ నేపథ్యంలో వైసిసి ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ ఒక మంచి అభ్యర్థి కోసం అన్వేషించినట్లు తెలిపారు. ఆ పరిశీలనో విద్యావంతురాలు, వైద్యురాలు, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న డాక్టర్ షెర్లిని అభ్యర్థిగా ఎంపిక చేశారని అన్నారు. అధిష్టానం కూడా ఆమె అభ్యర్ధిత్వం ఆమోదించటం శుభపరిణామం అన్నారు. మెరిట్ ఉన్న నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. చంద్రబాబుకు కుట్రలతో రాజకీయం చేయడం అలవాటేనని ఆరోపించారు. చీరాలలో వైసీపీ అభ్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అవివేకమని అన్నారు.

వైసిపి ఇన్‌ఛార్జి ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, మౌళిక వసతుల కల్పనే తమ తొలి ప్రాధాన్యతని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. రానున్న శాసన సభ ఎన్నికలు 2029లో తాను చీరాల నుండే వైసిపి అభ్యర్ధిగా పోటీ చేస్తానని, ఆ విషయం వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి కూడా స్పష్టం చేశారని అన్నారు. ప్రజలు తమ అభ్యర్ధి ఇస్తర్ల షెర్లీని దీవించి ఆదరించాలని కోరారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పోటీ చేస్తున్న వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులకు ప్రజలు అండగా నిలిచి గెలిపించాలని అన్నారు. తమ ఛైర్మన్‌ అభ్యర్థి కారు అద్దాలు పగలగొట్టిన ఘటన కావాలంటే రాజకీయంగా ఉపయోగించుకోవచ్చని, తాము అలాంటి రాజకీయ లబ్ధి కోసం చూడటం లేదని అన్నారు. ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత వాతావరణంలో పాలన కొనసాగించడమే తమ ఉద్దేశమని తెలిపారు.

డాక్టర్ షెర్లి గెలిచిన తర్వాత చీరాలలో ఉండరని, వెళ్లిపోతారని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆమె తండ్రి డాక్టర్ ఐ బాబురావు అన్నారు. డాక్టర్ వృత్తిలో కొనసాగుతూనే తమ ‘ప్రేమ హాస్పిటల్‌’లో పట్టణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తి గెలుపు కోసం గతంలో తాను ఎంతో కష్టపడ్డానో తనకు తెలిసని అన్నారు. ఆ విషయం మర్చిపోయి కృతజ్ఞత లేకుండా మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. పట్టణం ప్రజలు డాక్టర్ షెర్లి గెలుపునకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవకాశం కల్పించాలని అన్నారు.