Home బాపట్ల గాంధీ అహింసా సిద్దాంతం ప్రపంచానికి ఆదర్శం 

గాంధీ అహింసా సిద్దాంతం ప్రపంచానికి ఆదర్శం 

19
0

బాపట్ల (Bapatla) : అహింసా వాదంతో దేశ స్వాతంత్ర్యానికి మహాత్మా గాంధీ (Mahatma Gandhi) ఎన్నో ఉద్యమాలు నడిపి, చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, పానెల్ స్పీకర్, హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ (Bapatla MP Krishna prasad) అన్నారు.

మహాత్మా గాంధీ 157వ జయంతి స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం జరిగింది. కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హాల్లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి (farmer prime minister Lal bahadur shastri) చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ (Dr.vinod Kumar IAS), జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ ( bhavana wasista IAS), డిఆర్ఓ లవన్న, బాపట్ల ఆర్డిఓ హరికుమార్ తో కలిసి పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

గ్రామ స్వరాజ్యం (grama swarajyam) కొరకు మహాత్మా గాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు. గ్రామాల సుస్థిరాభివృద్ధికి ఆనాడే బీజాలు వేశారని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధిలోకి వస్థాయన్నారు. మహిళలను గౌరవించడం మంచి సంప్రదాయంగా గుర్తించి, ఆచరణలో పెట్టారన్నారు. దక్షిణాఫ్రికాలో ( South Africa) వివక్షకు గురైన మహాత్మా గాంధీ దేశానికి తిరిగి వచ్చి ఉద్యమాలు నడిపారన్నారు. అహింసా వాదంతోనే స్వాతంత్ర్యం సాధించగలమని, ఆయన చేపట్టిన ఉద్యమాలు ప్రజలను చైతన్యం చేశాయని అన్నారు. అప్పట్లో సాంకేతిక, ప్రచార రంగాలు లేనప్పటికీ ఆయన పిలుపుతో లక్షలాదిమంది ప్రజలు ఉద్యమంలోకి వచ్చారని వివరించారు. దేశ చరిత్రలోనే గొప్ప వ్యక్తిగా నిలిచారన్నారు. గాంధీజీ ఆలోచనలను స్పూర్తిగా తీసుకుని ప్రధానమంత్రి మోదీ (pm Narendra Modi) స్వచ్ఛ భారత్ పేరుతో స్వచ్ఛతా కార్యక్రమాలు ప్రారంభించారన్నారు.

జై జవాన్, జై కిసాన్ పిలుపుతో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రజలను చైతన్య పర్చారన్నారు. పలు కేంద్ర మంత్రి పదవులను సమర్థంగా నిర్వర్తించి గొప్ప వ్యక్తిగా నిలిచారన్నారు.

మహాత్మా గాంధీ శాంతి మార్గాన్ని ఎంచుకుని, అదే మార్గంలో దేశ ప్రజలను నడిపించి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టి, జాతి పితామహుడుగా చరిత్రలో నిలిచారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. మహాత్మా గాంధీ అహింసా సిద్దాంతాన్ని గౌరవిస్తూ ఆయన జయంతి రోజు మాంసాహారం, మద్యపానాన్ని నిషేదిస్తూ దేశ ప్రజలంతా పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. గాంధీ కలలతో మహిళలు కష్టపడి పనిచేసి ముందుకు వెళ్లారన్నారు.

రేపల్లెలో జేజమ్మ అనే మహిళ ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని, తమ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి ఎదగడానికి కృషి చేస్తుందన్నారు. ఇలాంటి విధానమే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) రాష్ట్ర ఉన్నత అధికారులకు ఆదేశించడం శుభ పరిణామం అన్నారు. బాపట్ల జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని స్వయంగా సీఎం చెప్పడం సంతోషదాయకమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన జయప్రదం అయ్యేలా కృషిచేసిన అధికారులు, ఉద్యోగులందరిని కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించడం సంతోష దాయకమన్నారు.

మాత్మ గాంధీ అందరికీ స్పూర్తి దాయకమని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. యుపిఎస్సి పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో తనకు ఎంతో స్పూర్తి రగిలించారని ఆమె గుర్తు చేశారు. గాంధీజీ సూచనలు తనన్నెంతగానో బలపరిచాయన్నారు. స్వాతంత్ర ఉద్యమానికి దేశంలో విత్తనాలు వేసిన గొప్ప వ్యక్తి ఆయనేనన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ లవన్న, ఆర్డిఓ హరికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.