Home బాపట్ల చీరాల వైసీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ ఇస్తర్ల షెర్లీ

చీరాల వైసీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ ఇస్తర్ల షెర్లీ

22
0

చీరాల (DN5 News) : మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. వైసిపిలో అభ్యర్ధుల ఎంపికకు తెరపడింది. వైసీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో డాక్టర్ ఇస్తర్ల బాబురావు, సుభాషిణి దంపతుల పెద్ద కుమార్తె డాక్టర్ ఇస్తర్ల షెర్లీని వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. డాక్టర్ షెర్లీ ప్రస్తుతం హైదరాబాద్‌లో వైద్యురాలిగా సేవలదిస్తున్నారు. బాబురావు, సుభాషిణి దంపతులు వైద్య సేవలతో పాటు రోటరీ క్లబ్, అంబేద్కర్ భావజాలం, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. పట్టణంలో 15 వేలకుపైగా ఎస్సీ ఓటర్లు ఉన్నారు. వీరితోపాటు ఇతర సామాజికవర్గాల ప్రజలతోనూ సన్నిహితంగా ఉండే డాక్టర్‌ బాబురావు తనయ అభ్యర్థిత్వం ఖరారు కావడం పట్ల వైసిపి కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.