Home బాపట్ల గ్రామాభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి : ఎంఎల్ఎ కొండయ్య

గ్రామాభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి : ఎంఎల్ఎ కొండయ్య

14
0

చీరాల (డిఎన్5) : మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీలో ఎన్డిఏ కూటమి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి పందరబోయిన అరుణ, సాల్మన్ సెంటర్ పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి గుంటూరు మేఘన విజయమే లక్ష్యంగా రామకృష్ణాపురం, సాల్మన్ సెంటర్ పంచాయతీలలో శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ కూటమి నాయకత్వాన్ని బలపరచాలనికోరారు. గ్రామ అభివృద్ధికి కూటమి సర్పంచ్, వార్డు సభ్యులను అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.