Home బాపట్ల పాఠశాలకు బీరువా బహూకరణ

పాఠశాలకు బీరువా బహూకరణ

7
0

పర్చూరు (DN5 News) : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని అన్నం భొట్లవారిపాలెం జెడ్‌పి ఉన్నత పాఠశాలకు బీరువా బుధవారం అందజేశారు. దేవరపల్లికి చెందిన తోకల తరుణ్ పుట్టినరోజు సందర్భంగా తరుణ్, సౌమ్య ఆర్థిక సహాయంతో బీరువాను అందజేసినట్లు క్లబ్ అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్ తెలిపారు. భవిష్యత్తులో పాఠశాలకు అవసరమైన వస్తువులు రోటరీ క్లబ్ ద్వారా సమకూర్చగలమని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కోమటి ఆంజనేయులు, అసిస్టెంట్ గవర్నర్ నాగబైరు శ్రీనివాసరావు, హెచ్ఎం భారతి, కొల్లా శివ నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు గోరంట్ల భాస్కరరావు, దొడ్డ వెంకటరావు, గోరంట్ల శివకుమారి పాల్గొన్నారు.