చీరాల (DN5 News) : పట్టణంలోని శ్రీ మేధావి జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పట్టణ, జిల్లా స్థాయిలో అగ్రస్థానాలు సాధించారని డైరెక్టర్ ఎంవి దుర్గాకుమార్ తెలిపారు. జూనియర్ ఎంపీసీలో కంచర్ల షైనీ, ముత్తిరెడ్డి జేశ్వంత్ సాయి, బాలం శ్రీనివాసులు 465 మార్కులు సాధించి పట్టణంలో బెస్ట్‌గా నిలిచారని తెలిపారు. బైపీసీలో కొండ్రు మనస్విని 450 మార్కులు, ఎంఈసిలో బుసం భానుశ్రీ 492 మార్కులు సాధించినట్లు తెలిపారు.
సీనియర్ ఇంటర్ ఎంపీసీలో బీరాక జై గణేష్ 987 మార్కులు సాధించి ప్రతిభ చాటారని అన్నారు. బైపీసీలో బిత్రా బానుశ్రీ 981 మార్కులతో టౌన్ బెస్ట్‌గా నిలిచారని అన్నారు. ఎంఈసిలో మురగొండి వెంకట కార్తీక్ 979 మార్కులతో అగ్రస్థానం సాధించారని తెలిపారు. సిఈసిలో కంచర్ల డేవిడ్ రాజు 903 మార్కులు సాధించి జిల్లా ప్రధమ స్థానంలో నిలిచి కళాశాలకు గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధతే విజయాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ టి సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ ఎస్‌కె అహ్మద్, ఏఓ అవినాష్ పాల్గొన్నారు.






