Home బాపట్ల విజ్ఞానభారతి విద్యార్ధుల విజయ ప్రభంజనం

విజ్ఞానభారతి విద్యార్ధుల విజయ ప్రభంజనం

7
0

చీరాల (DN5 News) : ఇంటర్ ఫలితాల్లో స్థానిక విజ్ఞాన భారతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఘన విజయం సాధించారు. క్రమశిక్షణతో కూడిన బోధన, నిష్ణాతులైన అధ్యాపక బృందం శిక్షణ, యాజమాన్యం అందించిన సమర్థ మార్గదర్శకత్వం వల్లే విజయాలు సాధ్యమయ్యాయని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మేజర్ డాక్టర్ తోట రోశయ్య తెలిపారు.

జూనియర్ ఎంపీసీలో పల్లపోలు దాక్షాయని, జాగాబత్తుని స్వాతి, బానోతు సౌమ్యశ్రీ 465 మార్కులు సాధించారు. బైపీసీలో యర్రబోలు బిందు భార్గవి 443, జంగా సింధు 442 మార్కులు పొందారని తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో నాసిక అనీష్ సూర్య 992 మార్కులు సాధించి ప్రతిభ చాటారు. సప్రమ్ సృజనా శంకర్, పొట్టూరి సురవందిత లక్ష్మీ 989 మార్కులతో రాణించారని తెలిపారు.

బైపీసీలో వేమ చరణ్ దత్త 979 మార్కులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో డైరెక్టర్లు టి భూపేంద్రరావు, ఎం బ్రహ్మయ్య, జి సుబ్బారావు, అకడమిక్ డైరెక్టర్ జి రామాంజనేయులు, ప్రిన్సిపాల్ పి నాగమల్లేశ్వరరావు తోపాటు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు.