చీరాల : మిర్యాలగూడలో ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్న ప్రణయ్, అమృత జీవితాలను చిదిమేసిన మతోన్మాద హంతకుల చర్యలకు నిరసనగా పట్టణంలో సోమవారం కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. గడియారస్తంభం సెంటర్లో మానవ హారం నిర్మించారు. పరువు పేరుతో దళితులపై అగ్రవర్ణాల దాడులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో డాక్టర్ ఐ బాబురావు, దళిత యువజన సంఘాల నాయకులు దార్ల శాస్త్రి, కనపర్తి బజ్జిబాబు, యాతం మేరిబాబు, గోసాల సుధాకర్ పాల్గొన్నారు.