Home బాపట్ల షుగరు ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

షుగరు ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

76
0

చీరాల : రామానంద ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వాడరేవు ఆశ్రమంలో షుగరు ఉచిత వైద్య శిభిరం ఆదివారం నిర్వహించారు. వైద్య శిభిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 1137 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి నెలకు సరిపడు మందులు ఉచితంగా అందజేసినట్లు ఆశ్రమ మేనేజర్‌ నారాయణం సురేష్‌ తెలిపారు. శిభిరానికి హాజరైన వారందరికి అల్పాహారం, తాగునీరు, ఇతర సహాయక ఏర్పాట్లు చేశారు. కేవలం మందులపై ఆధారపడవద్దని చెప్పారు. జీవన విధానం, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే షుగర్ నియంత్రణలో ఉంటుందని వైద్యులు సూచించారు. మానసిక ఆందోళన తగ్గించుకోవాలని చెప్పారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వ్యాయామం అలవాటు చేసుకోవడం ద్వారా షుగరు నియంత్రణలో ఉంచుకోవచ్చని చెప్పారు.

ఈ సందర్బంగా సిబార్ దంత వైద్య కళాశాల వైద్య బృందం సహకారంతో దంత, నోటికి సంబంధించిన వ్యాధులు, నోటి క్యాన్సర్ నిర్ధారణకు వేలోస్కోప్ అనే ఒక ప్రత్యేకమైన పరికరంతో ఉచిత పరీక్షలు చేశారు. పరీక్షల్లో నోటి క్యాన్సర్ లక్షణాలు కనబడిన వారికి కావలసిన వైద్యం ఉచితంగా చేసేందుకు ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ మేనేజర్ ఎన్ సురేష్ తెలిపారు. క్యాంపులో డాక్టర్‌ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్‌ కమలా రాజేశ్వరి, డాక్టర్‌ లలిత్‌ ప్రకాష్‌, డాక్టర్‌ శ్రీకాంత్‌ వైద్య పరీక్షలు చేశారు. ట్రస్ట్‌ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, సాయి ఫణికిషోర్‌, చందన, కామేశ్వరరావు, ఎంజి శంకరరావు, బసవరావు, కుమార్‌, ఎ సురేష్, మిత్ర ల్యాబ్ వలి, గోపాల్, వాడరేవు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, చీరాల మహిళా కళాశాల విద్యార్థులు రోగులకు ఆహారం, తాగునీటి వసతులు, సహాయక ఏర్పాట్లు చేశారు.