Home ప్రకాశం ముగిసిన కృషి సఖి సభ్యుల శిక్షణ

ముగిసిన కృషి సఖి సభ్యుల శిక్షణ

173
0

వేమూరు (Vemuru) : కొల్లూరు (Kolluru) మండలం దోనెపూడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం (Natural Forming) చేస్తున్న రైతులు పండించిన పంటలను క్షేత్ర పరిశీలన చేశారు. ఎఫ్‌పిఓ ఏపిఎం చిన్నయ్య ఆధ్వర్యంలో చెరుకుపల్లి మండల సమైక్య కేంద్రంలో కృషి సఖి సభ్యుల ఐదు రోజుల శిక్షణ శనివారంతో ముగించారు. జిల్లాలోని 12 మండలాల్లో సభ్యులకు ప్రకృతి వ్యవసాయంలో పెరటి తోటలు, పురుగు, తెగుళ్లు వాటి నివారణ అంశాలపై కషాయాలు తయారు చేసుకుని వినియోగించాల్సిన పద్ధతులపై మాస్టర్ ట్రైనర్లు ఎన్‌ఎఫ్‌ఎ ప్రసన్న, ఎంటి బాలపాప, ప్రసాదు, పిఆర్పి శివ నాగేశ్వరమ్మ శిక్షణ ఇచ్చారు. అనంతరం నేర్చుకున్న అంశాలపై పరీక్షలు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రసాయన ఎరువులు వాడకుండా ఆకులు అలములతో తయారు చేసుకునే కషాయములు వినియోగించుకోవడం వల్ల ఆరోగ్యం అంతమైన పంటలను పండించుకోవచ్చని మాస్టర్ ట్రైనర్‌ శివనాగేశ్వరమ్మ తెలిపారు.