– మాట్రిమొనిలో ఎంటెక్ చదివినట్లు నమ్మించాడు – లక్షల్లో ఆదాయం వస్తున్నట్లు నకిలీ ఆధారాలు – ఇరుగుపొరుగు ఇళ్లలో మహిళల వీడియోల చిత్రీకరణ – మహిళలతో వివాహేతర సంబంధాలు – విశాఖ నగర పెదగదిలీలో యువకుని గలీజు పనులు
విశాఖపట్నం (వెబ్‌డెస్క్) : అతను మాట్రీమొనిలో ఉన్నత చదువులు చదివినట్లు ప్రొఫైల్ పెట్టారు. బయోడేటా చూస్తే ఎవరైనా నమ్మాల్సిందే. చదువు ఎంటెక్. అందులోనూ ఆర్చిటెక్చర్. విశాఖ నగరంలో నిర్మాణ రంగంలో ఉంటూ ఇంటీరియర్ డిజైనర్‌నని చెప్పుకున్నారు. మాట్రీమొనీలో బయోడేటా ప్రొఫైల్ చూసిన ఉన్నత చదువులు చదువుకున్న యువతి తల్లిదండ్రులూ ఆకర్షితులయ్యారు. ఫోన్ నంబర్లతో మాటలు కలిశాయి. యువకుని ఇంటికి వెళ్లి చూస్తే ప్రొఫైల్‌లో ఉన్నట్లే ఆ యువకుని తల్లిదండ్రులు కూడా నటించారు. యువతిని, యువతి తల్లిదండ్రులను నమ్మించారు. వివాహం చేస్తే జీవితం బాగుంటుందని నమ్మి లక్షలు ఖర్చుపెట్టి వివాహం జరిపించారు.
వివాహం జరిగిన తర్వాత తెలిసింది. అతని అసలు స్వరూపం. రోజు ఇంటి నుండి క్యారేజీ తీసుకొని బయటికి వెళ్లడం. సాయంత్రం ఎప్పుడో తిరిగి రావడం. ఇదంతూ కొద్దరోజులు గమనించిన ఆమె అతని పనేమిటో తెలుసుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు తెలిసింది అతను ఆర్కిటెక్చర్ కాదని. అతను ఓ బిల్డర్ దగ్గర సూపర్వైజర్ అని తెలిసింది. అదైనా కష్టపడి పనిచేసుకునేవాడైతే పర్వాలేదు. కానీ అతని బుద్ది, అతను చేసే పనులన్నీ గలీజు పనులే. అతని గలీజు పనులన్నీ తల్లిదండ్రులకు తెలిసి కూడా ఏమీ తెలియనట్లు, తమ కొడుకు ఉన్నత చదువు చదివినట్లు నమ్మించారు.
అతను చేసే గలీజు పనులేంటో తెలిస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఇరుగు, పొరుగు ఇళ్లలలో మహిళలు స్నానాల గదుల్లో ఉన్నప్పుడో, భర్తలతో ఏకాంతంగా ఉన్నప్పుడో రహస్య కెమేరాలతో వీడియోలు తీసి వాళ్లను బ్లాక్‌మెయిల్ చేయడం. వాళ్లతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వంటి చేష్టలన్నీ వెలుగు చూశాయి. అతని సెల్‌ఫోన్ చూస్తే ఎంత వెధవ వేషాలు వేస్తున్నాడో తెలిసిపోతుంది. ఇవన్నీ తెలుసుకున్న యువతి తనను మోసం చేశాడని తెలుసుకుని నిశ్చేస్టురాలైంది. ఎవ్వరికీ చెప్పుకోలేక, అతని వేధింపులు భరించలేక చివరికి తల్లిదండ్రుల వద్దు చేరింది.
ఆందోళనలో అతని ఇంటి ఇరుగు పొరుగు మహిళలు
అతని సెల్‌ఫోన్లో ఎవరి వీడియోలు ఉన్నాయో తెలియదు. ఇరుగు పొరుగు మహిళలు తమ వీడియోలేమైనా తీశాడేమో, బయట పెడితే కుటుంబం వీధిన పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరం అరిలోవ, పెదగదిలి ప్రాంతంలో ఆ సైకో చేష్టలతో మహిళలు భయపడిపోతున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆ యువకునిపై చర్యలు తీసుకోవాలని, అతని వద్ద ఉన్న ప్రవేటు వీడియోలు డిలీట్ చేసి తమను రక్షించాలని ఆ ప్రాంత మహిళలు కోరుతున్నారు.






