చీరాల (DN5 NEWS) : ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రౌండ్ నందు ఎన్టిఆర్ 103వ జయంతి సందర్భంగా ఎన్టిఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఎన్.టి రామారావు ప్రవేశపెట్టిన రూ.2 లకే కిలో బియ్యం, పేదలకు కూడు, గూడు, గుడ్డ పథకం, కరణాలు, మునసబుల వ్యవస్థ రద్దు చేయడం, మాండలిక వ్యవస్థ ప్రవేశ పెట్టడం, తండ్రి ఆస్తిలో ఆడపిల్లకు సమానహక్కు, సంపూర్ణ మద్యపాన నిషేదం, రైతులకు రూ.50/- లకే హార్స్ పవర్ విద్యుత్తు వంటి అనేక పథకాలు అమలు చేశారని గుర్తుచేకున్నారు.
ఈ సందర్భంగా కోటయ్య అనాధ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం, చీరాల, పేరాల దీన జన అన్నదాన సేవా సంఘంనకు ఒక బస్తా బియ్యం అందజేశారు. వాకర్స్ సభ్యులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ల గురుప్రసాద్, వలివేటి మురళీకృష్ణ, గొడవర్తి సుధాకరారావు, నారాయణమూర్తి, డేగల తిరుపతిరావు, కే వీరాంజనేయులు, పూర్ణా, చింతా రమేష్, శ్రీనివాసరావు, రమణారావు, తుకారాం, బ్రహ్మానందం, బాల గంగాధరరావు, రామారావు, ఉమామహేశ్వరరావు, వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.






