చీరాల (DN5 News) : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ కమ్యూనిటీ హాలులో 2026-27 నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం నిర్వహించారు. రొటేరియన్ పాస్ట్ గవర్నర్ టి రాజశేఖరరెడ్డి రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల ప్రెసిడెంట్ తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, సెక్రటరీ చందలూరి బాల వెంకటేశ్వరరావు, కోశాధికారి పోలుదాసు రామకృష్ణ, క్షీరపురి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మువ్వల వంశీ కృష్ణ, సెక్రటరీ డాక్టర్ బోరుగడ్డ రవి తేజ, కోశాధికారి ఎం వెంకటేశ్వరరావు చేత ప్రామాణ స్వీకారం చేయించారు.
మాజీ గవర్నర్ మాట్లాడుతూ రోటరీ చిన్న చిన్న కార్యక్రమాలు కాకుండా శాశ్వతంగా గుర్తుండి పోయే మంచి కార్యక్రమాలు, పేద ఆడపిల్లలకు సైకిళ్ళు, చిన్న పిల్లల గుండెకు రంధ్రం పడితే సర్జరీ, ప్రమాదంలో చేయి మోచేతి కింద వరకు పోయిన వారికి ఉచితముగా చేతులు పెట్టించుట వలన వ్రాయుటకు, భోజనం చేయుటకు ఉపయోగ పడుతుందని అన్నారు. యువతకు ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుటకు శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు.
అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఐ బాబూరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం రోటరీ డిస్ట్రిక్ట్ 3150 యిచ్చిన క్యాలెండర్ ప్రకారం 48 కార్యక్రమాలు ప్రతి క్లబ్ తప్పక చేయాలన్నారు. అతిథుల ఇరువురిని సత్కరించారు. కార్యక్రమంలో జాలాది కృష్ణమూర్తి, బాచిన నాగ మల్లేశ్వరరావు, కరణం శ్రీనివాస బాబు, గుర్రం రాఘవరావు, సుభాషిణి, బండారుపల్లి హేమంత్ కుమార్, శీరాం రమేష్, జివై ప్రసాద్, రఘు కుమార్ పాల్గొన్నారు.






