Home బాపట్ల డైమెర్కోలో ఎఐ డెవలపర్‌గా సెయింట్ ఆన్స్ విద్యార్థిని

డైమెర్కోలో ఎఐ డెవలపర్‌గా సెయింట్ ఆన్స్ విద్యార్థిని

12
0

చీరాల (DN5 News) : స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని ఎఐ డెవలపర్‌గా హైదరాబాద్‌లోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ డైమెర్కో ప్రైవేట్ లిమిటెడ్‌లో నియమించబడినట్లు కళాశాల సెక్రెటరీ వనమా రామకృష్ణరావు, కరెస్పాండంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీశ్ బాబు మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థిని కొత్త వెంకట లక్ష్మి సాహితి ఇటీవల జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ డైమెర్కో ప్రైవేట్ లిమిటెడ్‌లో ఎఐ డెవలపర్‌గా సంవత్సరానికి రూ.8లక్షల వేతనంతో పాటు ఇతర అలవెన్స్‌లతో కూడిన ఉద్యోగంకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో సిఎస్‌ఇ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి, వివిధ విభాగాధిపతులు, కళాశాల యాజమాన్యం, మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి, విద్యార్థినీ విద్యార్థులు అభినందనలు తెలిపారు.