Home బాపట్ల చీరాలలో మెడికల్ షాపులు బంద్

చీరాలలో మెడికల్ షాపులు బంద్

12
0

చీరాల (DN5 News) : పట్టణంలోని మెడికల్ షాపుల యజమానులు బుధవారం బందు పాటించారు. ఔషధ రంగంలో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సమయంలొ తీసుకువచ్చిన జీఓ నెంబర్ జి ఎస్ ఆర్ 220 డేట్ 26-3-2020 ఈజీవో అసరాగా తీసుకొని కొన్ని ఆన్లైన్ లొ వారి స్వంత బ్రాండ్స్ ఇస్తున్నారని, అది కాక ప్రతి మందుల షాపుల మీద డ్రగ్స్ డిపార్ట్ మెంట్ వారి తనిఖీలు జరుగుతాయి కానీ ఆన్లైన్ లో అవి ప్రశ్నార్థకంగా ఉంటాయని అన్నారు.

వీటికి వ్యతిరేకంగా జాతీయ మెడికల్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు మెడికల్ షాపుల నిర్వాహకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుండి గడియార స్తంభం సెంటర్, తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కోవిడ్ సమయంలో ఆన్లైన్ మెడికల్ విక్రయాలకు అనుకూలంగా ఇచ్చిన జీవోలు రద్దు చేయాలని, గడువు దాటిన మందులను ఆన్లైన్లో అక్రమంగా విక్రయించడానికి నిరోధించాలని డిమాండ్ చేశారు.

దీర్ఘకాలికంగా ఉన్న ఔషధ దుకాణాల నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ర్యాలీ అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ర్యాలీలో మెడికల్ షాపుల అసోసియేషన్ అధ్యక్షులు టి పూర్ణ ప్రసాద్, కార్యదర్శి కెవి చెంచయ్య, కోశాధికారి బి సురేష్ బాబు పాల్గొన్నారు.