Home ప్రకాశం కాంగ్రెస్ సీటు కేటాయించాలి : పఠాన్ రాజేష్

కాంగ్రెస్ సీటు కేటాయించాలి : పఠాన్ రాజేష్

234
0

బాపట్ల (Bapatla) : కాంగ్రెస్ (Congress) శాసన సభ సీటు తనకు కేటాయించాలని ముస్లిం మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు పఠాన్ రాజేష్ (Pathan Rajesh) కోరారు. మైనారిటీ నాయకులతో పట్టణంలోని అంజుమన్ కాంప్లెక్స్ (Anjuman Complex) లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడచిన ఐదేళ్ళుగా మైనారిటీ సెల్‌ అధ్యక్షులుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ బాపట్ల అభ్యర్థిగా తన పేరు పరిశీలించాలని అధిష్టానాన్ని కోరారు. కొన్ని రోజులుగా అకస్మాత్తుగా రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ టిక్కెట్టు తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్న వారిపట్ల అధిష్టానం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అవకాశం కల్పిస్తే అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కాంగ్రెస్ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.