Home బాపట్ల ‘బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ’ : వైసిపి

‘బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ’ : వైసిపి

59
0

బాపట్ల : రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడంపై వైసిపి ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘బాబు షూరిటీ, మోసం గ్యారంటీ’ నినాదంతో చేపట్టిన కార్యక్రమంపై రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఇన్చార్జిలతో బుధవారం స్థానిక వైసిపి జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి చీరాల ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు, బాపట్ల జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, వైసిపి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జున మాట్లాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ‘బాబు షూరిటీ మోసం గ్యారెంటీ’ నిరసన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో వైసిపి వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, చీరాల, వేటపాలెం అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వైసిపి నియోజకవర్గ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.