చీరాల : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలి నిర్వహించారు. యుటిఎఫ్ కార్యాలయం నుండి దర్బార్‌రోడ్డు మీదుగా గడియార స్థంభం సెంటర్ నుండి తహశీల్దారు కార్యాలయం వరకు చేరుకున్నారు. ఈసందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె వీరాంజనేయులు, జిల్లా కార్యదర్శి గౌరాబత్తిన సూరిబాబు మాట్లాడారు. ప్రత్యేక హోదా ఆంద్రుల హక్కు అని అన్నారు. హోదా సాధించడంలో రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి ఉమ్మడిగా కేంద్రంపై చిత్తశుద్దితో ఒత్తిడి తీసుకురావాలని కోరారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ది, భావితరాలకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ సీనియర్ నాయకులు గవిని నాగేశ్వరరావు, జెవివి రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు, పట్టణ కార్యదర్శి షేక్ జానీబాషా, కెవిపిఎస్ అధ్యక్షులు లింగం జయరాజు, పాలేటి సురేష్, కుర్రా శ్రీనివాసరావు, బి పిచ్చియ్య, డి నారపరెడ్డి పాల్గొన్నారు.