చీరాల : రైతులకు సాగునీళ్లు సకాలంలో అందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం తహశీల్దారు ఎం వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. కాలువలు మరమ్మత్తులు చేయించి రైతులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు రావూరి వెంకటేశ్వర్లు ఉన్నారు.