చీరాల : సృంగారపేట ప్రాధమిక పాఠశాల విద్యార్ధులు ప్రతిభను చాటారు. సృంగారపేట ప్రాధమిక పాఠశాల విద్యార్ధులు ఎం దీప్తి, పి సాకేత్, డి సంకీర్తన, కె మోహన్, బి మానస వరుసగా 2, 14, 16, 40, 53ర్యాంకులు సాధించి 2018-19విద్యాసంవత్సరానికి నూతనంగా విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ప్రారంభం కానున్న ఎపి మోడల్ స్కూల్‌లో చేరేందుకు అర్హత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గల్లా అరుణకుమారి తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్ధులను శనివారం పాఠశాల ఆవరణలో అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అల్లూరయ్య, లలితప్రియ, జ్యోతి పాల్గొన్నారు.
ముగిసిన సంవత్సరాంత పరీక్షలు
6నుండి 9 తరగతుల విద్యార్ధులకు శనివారంతో సమ్మేటివ్ 2 సంవత్సరాంత పరీక్షలు ముగిశాయి. ఏప్రిల్ 23చివరి రోజు. ఏప్రిల్ 24నుండి 30వరకు మన ఊరు – మన బడి కార్యక్రమం జరుగనుంది. ఆతర్వాత జూన్ 11వరకు వేసవి సెలవులు ప్రభుత్వం ప్రకటించింది.