◆గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందిస్తున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు
◆ మిఠాయిలు, జ్ఞాపికలు అందచేసిన ఏలూరి
◆3500 మందికిపైగా టీచర్లకు ఏలూరి అభినందనలు.
◆క్రమం తప్పకుండా ఉపాధ్యాయ దినోత్సవ జ్ఞాపికలు అందిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
◆పుస్తక రూపంలో నాలుగేళ్ళలో విద్యాఅభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి కల్పనకు చేసిన కృషి
మార్టూరు : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తనదైన శైలిలో ఉపాధ్యాయులను గౌరవించారు. నియోజకవర్గంలో గత నాలుగేళ్లుగా విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం చేసిన కృషిని పుస్తక రూపంలో ఇచ్చారు. ప్రతి ఏటా ఉపాధ్యాయులకు స్వీట్లు, జ్ఞాపికలు, ప్రశంసలతో ఆయా గ్రామాల్లోని తమ పార్టీ నాయకుల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసేవారు.
సమాజ ప్రగతి, చిన్నారుల ఉజ్వల భవిష్యత్ కొరకు అచంచల విశ్వాసంతో, నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులంటే తనకు అమితమైన గౌరవమని ఎమ్యెల్యే ఏలూరి సాంబశివరావు చెప్పారు. పూజ్యనీయభావంతో ప్రతి ఏటా క్రమం తప్పకుండా సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియచేయటం ద్వారా సమాజంలో ఉపాధ్యాయుల ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నారు.
ఈ సంవత్సరం కూడా నియోజకవర్గంలోని టీచర్లతో పాటుగా వేరే ప్రాంతంలో పనిచేస్తున్న ఈ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులను కలుపుకుని సుమారు 3500 మంది గురువులకు తమ పార్టీ నాయకుల ద్వారా ఎక్కడికక్కడ గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగేళ్ళ విద్యా, ఉపాధి, మౌలిక వసతుల కల్పనలో చేసిన కృషిని వివరిస్తూ ప్రచురించిన పుస్తకాలు పంపిణీ చేశారు.