చీరాల : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, రైతు సంఘాలు చేపట్టిన పోరాటానికి మద్దతుగా అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు బుధవారం చీరాల ఎల్ఐసి కార్యాలయంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి విజయ కుమార్, బి నాగేశ్వరరావు, ఆర్వీఎస్ రామిరెడ్డి, ఏజెంట్స్ యూనియన్ నాయకులు వివి సుబ్బారావు, వేణు బాబు పాల్గొన్నారు.