Home ప్రకాశం గురువులకు ఘన సన్మానం

గురువులకు ఘన సన్మానం

444
0

చీరాల : విఠల్ నగర్లోని చైతన్య మనోవికాస కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో రొటరి ప్రెసిడెంట్ వి మురళి క్రిష్ణ, ట్రెజరర్ పి రామకృష్ణ, శీరాం రమేష్, ఇంస్టిట్యూట్ డైరెక్టర్ యన్ వెంకంన్న బాబు, ప్రిన్సిపల్ యన్ మాధురీ పాల్గొన్నారు.

చీరాల ఆదినారాపురం హైస్కూల్ నందు టీచర్స్ డే బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ తల్లి తర్వాత ఎక్కువగా పిల్లలు ఉండేది గురువు వద్దేనని అన్నారు. అటువంటి వారిని సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో టి రమేష్, రావూరి వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, బత్తుల బ్రహ్మానందరెడ్డి, మద్దిరెడ్డి మోహన్రావు పాల్గొన్నారు.

ఈపురుపాలెం భావనారుషిపేట మండలపరిషత్ ప్రాధమిక పాఠశాలలో జరిగిన గురుపూజోత్సవ సభలో చీరాల వ్యవసాయాధికారిని ఈ పాతిమ మాట్లాడారు. విద్యార్థులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో నేతాజీ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్ సురేష్, సెక్రటరీ బుదాటి శ్రీనివాసరావు, దేవేంద్రనాద్, మని, ఎమ్ సత్యనారాయణ, రామారావు, లక్ష్మయ్య, గ్రామపెద్దలు పి లక్ష్మణస్వామి, బాలకృష్ణ పాల్గొన్నారు.