Home ప్రకాశం టిడిపి సేవామిత్ర శిక్షణా శిబిరం

టిడిపి సేవామిత్ర శిక్షణా శిబిరం

318
0

కందుకూరు : టిడిపి సేవామిత్ర 24వ బాచ్ శిక్షణ ముగిసినట్లు శిక్షణ డైరెక్టర్, జెడ్పిటిసి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత క్రమశిక్షణ కలిగిన మనమందరం టెక్నాలజీని అందిపుచ్చుకొంటే అద్భుతాలు సాదించ వచ్చని అన్నారు. మనం చేసే పనిని ఎంత వరకు ప్రజల్లోకి తీసుకేల్తున్నామో తెలుసుకొని పని చేయడం రాజకీయ నాయకులకు చాలా ముఖ్యమని అన్నారు.

అంతేకాకుండా మనం చాల కీలకమైన దశలో ఉన్నామన్నారు. ఈ దశలో ప్రత్యర్ధుల ఎత్తుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. వరుస సంక్షేమ ఫధకాలతో దూసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం బాబు ప్రభుత్వమని చెప్పారు. తిరిగి 2019ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చే విధంగా ప్రతి సేవామిత్ర కృషి చేయాలని అన్నారు .ఈ కార్యక్రమంలో శిక్షణ శిభిరం శిక్షకులు కాకర్ల మల్లిఖార్జున్, యర్రా సాంబశివరావు, కో ఆర్డినేటర్ పోకూరి రాంబాబు, కొల్లి అవినాష్ పాల్గొన్నారు.