Home ఆంధ్రప్రదేశ్ అరకు ఎంపీ కొత్తపల్లి గీత ‘జనజాగృతి’ 

అరకు ఎంపీ కొత్తపల్లి గీత ‘జనజాగృతి’ 

426
0

అమరావతి : అరకు ఎంపీ కొత్తపల్లి గీత తన కొత్తరాజకీయా పార్టీని ప్రకటించారు. జనజాగృతి పార్టీగా పెరు, పతాకం, గుర్తును ప్రకటించారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మార్పుకోసం – ముందడుగు నినాదంతో పార్టీ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో రెండు కులాలు, రెండే కుటుంబాలు పెత్తనం చేస్తున్నాయన్నారు. ప్రధానంగా ఇద్దరు చేతుల్లోనే రాజకీయం నడుస్తోందని ఆరోపించారు. ‘బడుగు బలహీనవర్గాలకు ఇతర కులాలకు రాజకీయ అవకాశాలు లేకుండా చేశారు. వారిని కులాలను బానిసలుగానే చూస్తున్నారు. అది మారాలి. మహిళలు, ఇప్పటివరకూ రాజకీయ అవకాశాలు పొందని కులాలకు అవకాశం కల్పించేందుకే కొత్తపార్టీని ప్రారంభించాను’ అని చెప్పారు.

‘రాష్ట్ర విభజన తర్వాత.. అనుభవజ్ఞుడని చంద్రబాబునాయుడుకు ప్రజలు అధికారం ఇస్తే ఆయన రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాల అరాచకం నెలకొంది. ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు ప్రజలు పట్టడంలేదు. అసెంబ్లీకీ వెళ్లడు. ఎప్పుడెప్పుడు అధికారం చేతికొస్తుందా అన్న ఆలోచన తప్ప మరొకటి లేని నాయకుడు’ అని అన్నారు.

తాను మహిళలకు మూడోవంతు, జనరల్‌ స్థానాల్లోనూ ఎస్సీఎస్టీలకు సీట్లు ఇస్తానన్నారు. ఇతర పార్టీలు తన సవాల్‌కు సిద్ధమా అని ప్రశ్నించారు. ‘‘నాపై ఎలాంటి కేసుల్లేవు. నా వ్యక్తిగత విషయాలను మా కుటుంబం చూసుకుంటుంది. కేసుల గురించి మాట్లాడేపనైతే చాలామంది గురించి చాలా చెప్పాలి’’అని పేర్కొన్నారు.