చీరాల : వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి మహిళలు పూజలు చేశారు. అమ్మవారికి పసుపు, కుంకుమలు, గాజులు, చీర, సారెలు సమర్పించుకున్నారు. అమ్మవారికి పొంగల్లు పెట్టుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేటపాలెంలో వేపచెట్టుకు చిరకట్టి అలంకరించారు. వితలెనగర్లో దేవతామూర్తుల వేషధారణలో ఊరేగింపు చేశారు. ముత్యాలపేట మహాలక్ష్మి అమ్మవారి చెట్టుకు మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి దర్శించుకున్నారు. ప్రతిఇంటా మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.