వేటపాలెం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆదివారం చీరాల వచ్చారు. ఆయనను ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ నివాసంలో ఆర్యవైశ్య ప్రతినిధులు, పట్టబద్రుల సంఘం అధ్యక్షులు పత్తి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో షాలువాతో సత్కరించారు.