వేటపాలెం : ఈ నెల 7న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీరాల నియోజకవర్గ పర్యటనకు రానున్నారు. సిఎం పర్యటన ఏర్పాట్లు వేగవంతంగా చేయాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన చీరాల నియోజకవర్గంలోని పందిళ్లపల్లి చేనేత కార్మికుల కాలనీనీ, రామన్నపేటలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను, సెంట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ను, సభా ప్రాoగణాన్ని ఎంఎల్ఎ ఆమంచి కృష్ణ మోహన్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ సిఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు వేలాది మంది ప్రజలు హాజరయి విజయవంతం చేయాలని కోరారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా త్రాగునీరు, భోజన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పరిశీలనతో మంత్రి వెంట చీరాల మున్సిపల్ ఛైర్మన్ మోదడుగు రమేష్‌బాబు, ఎఎంసి ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు, హస్తకళల కార్పోరేషన్ డైరెక్టర్ గొడుగుల గంగరాజు, కౌన్సిల్ గుద్దంటి సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, స్టెప్ సిఇఓ బి రవి, జిల్లా పంచాయతీ అధికారి ప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె రాజ్యలక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్య, డిఎస్‌పి వల్లూరు శ్రీనివాసరావు, సిఐ భక్తవత్సలరెడ్డి పాల్గొన్నారు.