Home విద్య ఎముక‌ల సాంద్ర‌త – ఆహార ప‌ద్ద‌తులు : డాక్ట‌ర్ చ‌లువాది వెంక‌టేశ్వ‌ర్లు

ఎముక‌ల సాంద్ర‌త – ఆహార ప‌ద్ద‌తులు : డాక్ట‌ర్ చ‌లువాది వెంక‌టేశ్వ‌ర్లు

439
0

వైద్య‌విభాగం : యవ్వనంలో ఉన్న‌ప్పుడు ఎముక‌ల ఇబ్బంది తెలియ‌దు. ఎడా పెడా తిరిగేస్తంటాం. కానీ కొంత‌ వయసు పెరిగే కొద్ది ఎముక క్షీణత ఎక్కువగా ఉంటుంది. 45-50 ఏళ్లు దాటిన వారిలో ఎముకలు ఎండుపుల్లల్లా పెళుసుగా, బోలుగా మారే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని చీరాల శ్రీ‌కామాక్షి కేర్ హాస్పిట‌ల్ ఎముక‌లు, కీళ్ల వైద్య‌నిపుణులు డాక్ట‌ర్ చ‌లువాది వెంక‌టేశ్వ‌ర్లు చెబుతున్నారు. స్త్రీలలో ఎముక‌లు పెలుసుబారే స్వ‌బావం మరీ ఎక్కువ ఉంటుంద‌న్నారు. దీనివల్ల చీటికీమాటికీ పడిపోవటం, ఏ చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోవటం చాలా తరచుగా చూస్తుంటామ‌న్నారు. పైగా ఒకసారి విరిగితే వీరిలో అంత త్వరగా అతకవన్నారు. ఇలాంటి స్థితిలో కదలికలు తగ్గిపోతాయ‌న్నారు. తన పని తాను చేసుకునే పరిస్థితి కూడా లేకపోవటం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయన్నారు. ఎముక సాంద్రత తగ్గటం వల్ల వెన్నుపూసలు విరిగిపోవటం కూడా వీరిలో ఎక్కువగా జ‌రుగుతుంద‌న్నారు. అసలీ ఎముక బోలు సమస్య (ఆస్టియోపొరోసిస్‌) వృద్ధాప్యంలో చాలా సహజమని అంతా నమ్ముతుంటారుగానీ ఇది నిజం కాదన్నారు. ముందు నుంచీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిన పడాల్సిన అసరం ఉండ‌ద‌న్నారు. పొగ తాగకుండా ఉండటం మంచిద‌న్నారు.

క్యాల్షియం దండిగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాల‌ని చెప్పారు. మన జీవక్రియలకు తగినంత క్యాల్షియం అవసరమ‌ని పేర్కొన్నారు. మన ఆహారంలో క్యాల్షియం తగినంత లేకపోతే మన శరీరం దాన్ని ఎముకల నుంచి వెనక్కి తెచ్చుకుంటుందని వివ‌రించారు. దీంతో ఎముకలు బలహీనపడతాయని చెప్పారు. స్ర్తీల‌లో కడుపులో బిడ్డ ఎదిగేటప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు స్త్రీ శరీరం నుంచి చాలా క్యాల్షియం బిడ్డకు వెళ్లిపోతుందని వివ‌రించారు. దీంతో స్త్రీలు ఆస్టియోపొరోసిస్‌ బారినపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయ‌న్నారు. కాబట్టి క్యాల్షియం ఎక్కువగా ఉండే పాల పదార్థాలు, ఆకుకూరలు, సోయా, గోబీ, చేపల వంటివి తీసుకోవడం ద్వారా కాల్షియం లోటును అధిగ‌మించ‌వ్చ‌ని చెప్పారు. ఈ తీసుకున్న క్యాల్షియం ఎముకలకు పట్టేందుకు వ్యాయామం చెయ్యటం కూడా అవసరమ‌ని పేర్కొన్నారు. అలాగే కాస్త ఎండలో తిరిగితే విటమిన్‌-డి దక్కుతుందని సూచించారు. విట‌మిన్ – డి ఎముక బలానికి ముఖ్యమైన‌ద‌న్నారు. ఒక వయసు రాగానే అందరూ వైద్యులను సంప్రదించి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవాల‌ని సూచించారు. ఆస్టియోపొరోసిస్‌ ఉంటే తగు జాగ్రత్తలు, చికిత్స తీసుకోవటం మంచిద‌న్నారు. అలాగే బాత్రూముల్లో పడిపోకుండా నేల నునుపుగా జారిపోయేలా లేకుండా చూసుకోవాల‌న్నారు. ఇంట్లో నడిచేటప్పుడు పరిస్థితిని బట్టి నాలుగుకోళ్ల కర్ర సాయం తీసుకోవటం అవ‌స‌ర‌మ‌న్నారు. తల తిప్పటం, తూలు రావటం వంటి లక్షణాలు కనబడుతుంటే తక్షణం వైద్యులకు చూపించి చికిత్స తీసుకోవటం కూడా మంచిద‌ని చెప్పారు.