Home Uncategorized పేరాల హైస్కూల్ లో 40 ఏళ్ళ నాటి విద్యార్థుల సందడి

పేరాల హైస్కూల్ లో 40 ఏళ్ళ నాటి విద్యార్థుల సందడి

1034
0

పేరాల హైస్కూల్ గా ప్రసిద్ధి పొందిన ఆంధ్రరత్న మునిసిపల్ హైస్కూల్లో నాలుగు దశాబ్దాల క్రితం విద్యనభ్యసించిన విద్యార్థులు ఇప్పుడు సందడి చేసారు. సీతారామయ్యగారు చెప్పిన తెలుగు… తారకనాధ్ గారు బోధించిన లెక్కలు… హేమలత మేడం ఇంగ్లిష్… ఆనందరవుగారి ncc… మరేందరో మాస్టార్లతో అనుభవాలు… ఫైనల్గా స్కూల్ గ్రౌండ్ లో  సుబ్బారావుగారు బెత్తం దెబ్బలు గుర్తు చేసుకునిబ్ పుపకించిపోయారు. 1981-82 పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఆహ్లాదకరంగా సాగింది. ఆ బ్యాచ్ విద్యార్థి ప్రస్తుతం అదే స్కూల్ ప్రధానోపాధ్యాయునిగా వున్న సాల్మన్ రాజుగారి ఆధ్వర్యంలో ఎక్కడెక్కడో సెటిల్ అయినా పూర్వ విద్యార్థులంతా మళ్ళీ పాఠశాలకు చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలనాటి ఊసులను గుర్తు చేసుకున్నారు.


40 ఏళ్ళ తర్వాత కలిసిన వీరంతా ఈ నాలుగు దశబ్దల కాలంలో తమ జీవన పయనంలో ఎదురైనా అనుభవాలను ఒకరితో మరొకరు పంచుకున్నారు. పదో తరగతిలో పాఠశాలను వదిలిన వీరంతా ఆ తర్వాత ఉన్నత విద్యను పూర్తి చేసి ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. తాము చదివిన రోజుల్లో పాఠశాల వున్న తీరును గుర్తు చేసుకుని ఇప్పుడు రూపురేఖలు మారిపోయిన స్కూల్ ని చూసి ఆనందోత్సవాన్ని వ్యక్తం చేసారు.

తమతో కలిసి చదివిన సాల్మన్ రాజు ఇప్పుడు ప్రధానోపాధ్యాయులు గా ఉండడం.. మ్ అయన సారథ్యంలో పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి అయనపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సందర్భంగా ఆనాడు తమకు చదువు చెప్పిన గురువులందరిని పిలిపించి వారిని సత్కరించుకున్నారు. 40 ఏళ్ళనాటి మిత్రులను ఇలా కలిపెందుకు ఏడాది పాటు కృషి చేసినట్లు సాల్మన్ రాజు తెలిపారు.