Home ప్రకాశం ఐటీ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విస్తృత అవకాశాలు : సీఈసీసెమినార్ లో అంతర్జాతీయ ఐటీ నిపుణుల...

ఐటీ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విస్తృత అవకాశాలు : సీఈసీసెమినార్ లో అంతర్జాతీయ ఐటీ నిపుణుల విశ్లేషణ

460
0

చీరాల : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం ఐటీ పరిశ్రమలో తాజా ట్రెండ్స్ పై అవగాహన పెంచుకోవడం అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూకే లోని (ఇంగ్లాండ్) ఐటీ రంగ నిపుణులు వి హనుమంతరావు, తోట అరుణలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తోట అరుణ మాట్లాడుతూ దగ్గుపాడు అనే చిన్న గ్రామంలో నుంచి వచ్చిన తాను ఐటీ రంగంలో నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎదగలిగాను అన్నారు. గ్రామీణ ప్రాంతంలోనీ విద్యార్థులలో సహజ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయని, ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉంటుందని వాటితో పాటు సబ్జెక్టుపై నైపుణ్యం పెంచుకోగలిగితే సులువుగా ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగు తారాన్నారు. కరోనా సమయంలో ఐటీ రంగ సేవలు విస్మరించలేనివని తెలిపారు. ఈ విపత్కర కాలంలో సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించింది వివరించారు. ఆన్లైన్ క్లాసులు, ఇంటి వద్ద నుంచే కార్యాలయాల్లోని పని చేయగలగటం ఇలా అనేక మార్పులు ఈ సమయంలో వచ్చాయన్నారు. దీనివలన ఐటీ రంగానికి మంచి డిమాండ్ పెరిగిందని తెలిపారు.

మరో ఐటి రంగ నిపుణులు వి హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఎదుగుదలకు ప్లానింగ్ ఎంతో ముఖ్యమని తెలిపారు. భాష అనేది ముఖ్యం కాదని సబ్జెక్టు మీద పట్టు పెంచుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్నారు. క్రమశిక్షణ, పట్టుదల అంకితభావంతో పాటు సానుకూల దృక్పథంతో ఆలోచించటం కూడా మన ఉన్నతికి దోహదపడుతుందన్నారు.

క్లౌడ్ కంప్యూటరింగ్, aws, దేవాప్స్(Devops), ఫైతన్, ఏజైన్ మేతరాలజి, ఎజుర్ (Azure) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రిండింగ్లో ఉన్న కోర్సులని వివరించారు. వీటినీ నేర్చుకొని  నైపుణ్యం సాధిస్తే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి సెమినార్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐటీ రంగ నిపుణులు ఇచ్చే సలహాలు ఎంతో ఉపయోగపడతాయని, వాటిని పాటిస్తూ ఉన్నత భవిష్యత్తును సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ శాఖల హెచ్.ఓ.డీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.