చీరాల : చేనేత ఉధ్యమ నేత, ప్రజాబందు ప్రగడ కోటయ్య 104వ జయంతి సభను గురువారం ప్రగడ కోటయ్య వీవర్స్ వెల్పేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సభకు ప్రగడ కోటయ్య ఆర్గనైజేషన్ నాయకులు దామర్ల శ్రీకృష్ణ అధ్యక్షత వహించారు. సభలో ఎంఎల్సి పోతుల సునీత, సురేష్ మాట్లాడారు. ప్రగడ కోటయ్య స్పూర్తితో చేనేత, ఇతర చేతి వృత్తుల రక్షణకు ఐక్యం కావాలని కోరారు. బిసిలు, చేనేత ప్రతినిధులను చట్ట సభలకు పంపాలని కోరారు. సభలో చేనేత ప్రతినిధులు పడవల లక్ష్మణరావు, జడ్పీటిసి పృథ్వి అరుణ, ఎంపిపి గవిని శ్రీనివాసరావు, గోసాల ఆశీర్వాదం, న్యాయవాది వై కోటేశ్వరరావు, ఓ సాగర్, మోహన్ కుమార్ ధర్మా, యాతం ఆనందరావు, చుండూరు వాసు, అవ్వారు ముసలయ్య, తదితరులు పాల్గొన్నారు.