చీరాల : కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆగష్టు 9న జైల్‌బరో కార్యక్రమంలో కార్మికులు పాల్గొనాలని సిఐటియు ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బాపనమ్మ కళ్యాణ మండపంలో జరిగిన సిఐటియు చీరాల డివిజన్ కమిటి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశం నిర్ణయాలను డివిజన్ కార్యదర్శి ఎన్ బాబురావు సభ్యుల దృష్టికి తెచ్చారు.
చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ.18వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండు చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించాలని కోరారు. ధరల పెరుగులదల నివారించాలన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, అందరికీ రేషన్ ఇవ్వాలని కోరారు. రైతులకు సా్వమినాధన్ కమిటి సిఫార్సులు అమలు చేయాలని కోరుతూ ఆగష్టు 9న ఒంగోలులో జరిగే జైల్‌బరో కార్యక్రమంలో కార్మికులు పాల్గొనాలని కోరారు. గడిచిన నాలుగేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చారని ఆరోపించారు. రవాణ చట్టం సవరణను వెంటనే ఆపాలని కోరారు. మద్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలనే నిర్ణయం విరమించుకోవాలన్నారు. సమావేశంలో సిఐటియు నాయకులు ఎం వసంతరావు, ఎవి రమణ, జి గంగయ్య, జి సుధాకర్, ఎం చిరంజీవి, ఆర్ దావీదు, టి ప్రభాకర్, పి కాలేషా, బి సుబ్బారావు, దేవతోటి బుల్లెమ్మాయి, కందుకూరి యల్లమంద, జాన్సీ, కృష్ణవేణి, బ్యూలా, కె ఏసురత్నం, కె పోతురాజు, ఇమ్మానియేలు, అనిల్ పాల్గొన్నారు.