చీరాల : క్షేత్రస్థాయిలో అంగన్ వాడిల బలోపితనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ అన్నారు. శుక్రవారం స్థానికి మునిసిపల్ ఓపిన్ థియేటర్లో జరిగిన సమావేశంలో అర్బన్ అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఎల్కేజి, యూకేజీ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ అంగన్వాడిల బలోపితంలో భాగంగా ఈపాటికె మోడ్రన్ అంగన్వాడిలను ఏర్పాటు చేసిందన్నారు. మెరుగైన విద్యా, వసతులు, పౌష్టికాహారం వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడి కేంద్రాలలో చేర్చాలన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి ఎంఎస్ మురళి, మునిసిపల్ చెర్మన్ ఎమ్ రమేష్, కమిషనర్ షేక్ ఫజల్లుల్లా, సీడీపీఓ నాగమణి పాల్గొన్నారు.