చీరాల : ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎంఎల్సి పోతుల సునీత కోరారు. తన నివాసంలో శుక్రవారం మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.4.86లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
కార్యక్రమంలో జెడ్పిటిసి పృద్వి అరుణ, పోతుల యువసేన నాయకులు పోతుల ప్రకాష్, మండల కొఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, కాపు నాయకులు రంగినేని వెంకటరావు, అవ్వారు ఆడినారాయణమూర్తి, శ్రీకాంత్, మాజీ ఎంపిటిసి పృద్వి వెంకటేశ్వర్లు, నువ్వుల బ్రహ్మయ్య పాల్గొన్నారు.