Home విద్య జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్ బ్రోచర్ ఆవిష్కరణ

జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్ బ్రోచర్ ఆవిష్కరణ

607
0

తిరుపతి : 26వ జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్ బ్రోచర్ను ఆవిష్కరించారు. తిరుపతి అన్నమాచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవరణలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. స్వేచ్ఛ మైన, ఆరోగ్యమైన, హరితమైన దేశం కోసం శాస్త్ర సాంకేతికత, సృజనాత్మక ఆలోచనలు ప్రధానాంశాలుగా నిర్ణయించారు.

పర్యావరణం – ఉపయోగాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, చెత్తనుంది సంపద సృష్టి, సమాజము, సంస్కృతి, జీవనోపాధి, సాంప్రదాయక విజ్ఞాన వ్యవస్థలు వంటివి ఉప అంశాలుగా ప్రకటించారు. ఆగస్టులో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సులు, అక్టోబర్లో జిల్లా స్థాయి ఎంసీఎస్కి సదస్సు, నవంబర్ లో రాష్ట్ర స్థాయి సదస్సు, డిసెంబర్ 27నుండి31వరకు జాతీయ స్థాయి సదస్సు జరుగనున్నాయి. 2019 జనవరి 3నుండి 7వరకు జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తారు. సమావేశంలో మెంబర్ సెక్రటరీ బివిఏ కృష్ణమూర్తి, ప్రాజెక్ట్ అఫికెర్ జె ఢిల్లీశ్వరరావు, స్టేట్ అకడమిక్ కోఆర్డినేటర్ పి మురళి, వివిధ జిల్లాల కోఆర్డినేటర్ లు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.