Home ప్రకాశం వాడరేవు రామనంద సరస్వతి ఆశ్రమంలో ఉచిత షుగర్ వైద్య శిబిరాన్ని విశేష స్పందన

వాడరేవు రామనంద సరస్వతి ఆశ్రమంలో ఉచిత షుగర్ వైద్య శిబిరాన్ని విశేష స్పందన

545
0

చీరాల : ప్రతినెలా నాలుగో ఆదివారం నిర్వహిస్తున్నట్లే ఈ రోజు వాడరేవు రామనంద సరస్వతి ఆశీస్సులతో ఆశ్రమం ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 1424మందికి ఉచితంగా రక్త పరీక్షలు, శుగరుపరిక్షలు నిర్వహించారు. అవసరమైన వారందరికీ నెలరోజులకు సరిపడు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామనంద సరస్వతి ట్రస్ట్ ఉపాధ్యక్షులు కృష్ణారావు, మేనేజర్ ఎన్ సురేష్ మాట్లాడారు. ఉచిత షుగరు వైద్య శిబిరం నిర్వహించడం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరం లోకి వచ్చినట్లు తెలియారు.

డాక్టర్ ఎం రాజరాజేశ్వరి రోగులకు సూచనలు చేశారు. కేవలం మందులపైనే ఆధారపడకుండా ఆహార నియమాలు పాటించాలన్నారు. శరీర వ్యాయామం చేయాలని చెప్పారు. శిబిరానికి హాజరైన రోగులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. శిబిరంలో డాక్టర్ కమలారాజేశ్వరి, డాక్టర్ లలిత్ ప్రకాష్ చంద్ర, డాక్టర్ పేట శ్రీకాంత్, డాక్టర్ సుధాకర్ యాదవ్ వైద్యపరీక్షలు నిర్వహించారు.