Home ప్రకాశం 24న వైసిపి ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్

24న వైసిపి ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్

374
0

చీరాల : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు, టిడిపి తీరుకు నిరసనగా ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఈనెల 24న రాష్ట్ర బంద్ ప్రకటించిన నేపథ్యంలో చీరాలలో బంద్ చేస్తున్నట్లు వైసిపి పట్టణ అధ్యక్షుడు బినిగల జైసన్ బాబు తెలిపారు. వైసీపీ ఇంచార్జ్ యడం బాలాజీ ఆధ్వర్యంలో జరిగే బంద్ కు ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో వైసిపి మండల అధ్యక్షుడు పిన్నిబోయిన రామకృష్ణ, నీలం శ్యామ్, డాలర్ల శాస్త్రి, గడ్డం శ్రీను, సుభాని పాల్గొన్నారు.