Home ప్రకాశం నూతన మోటారు వాహన చట్టంతో ఛిద్రం కానున్న ఉపాధి

నూతన మోటారు వాహన చట్టంతో ఛిద్రం కానున్న ఉపాధి

456
0

చీరాల : కేంద్ర ప్రభుత్వం నూతనంగా పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న మోటారు వాహన చట్టంతో రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, ఇతరులకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు చెప్పారు. నూతన మోటారు వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ పొట్టిశ్రీరాములు టాక్సీ స్టాండ్ వద్ద ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న వాహనాలు, వేగానికి అనువైన రోడ్లు అభివృద్ధి చేయకుండా ప్రమాదాలకు కనీసం కారణాలు విశ్లేషించకుండానే డ్రైవర్లను ముద్దాయిలను చేసేవిధాగా నూతన చట్టం ఉందని అన్నారు.

చట్టం అమలైతే అధికారుల వేధింపులు పెరుగుతాయన్నారు. వాహనం ఖరీడుకన్నా వాహనానికి కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ ఉంటుందన్నారు. వాహనాన్ని కొన్న యజమానికి వచ్చే సంపాదన టాక్స్లు కట్టడానికి, రోడ్డుపై తిరిగెటప్పుడు పెనాల్టీలు కట్టడానికి చాలవని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు డ్రైవర్లు ఎంతకారణమో అంతకన్నా రోడ్లు, సిగ్నల్స్ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం కూడా అంతే ఉందన్నారు. అవన్నీ వదిలి డ్రైవర్లను ముద్దాయిలను చేస్తూ చట్టం రూపొందించారని చెప్పారు. నూతన మోటారు వాహన చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. సభకు సిఐటియు నాయకులు ఏవి రమణ అధ్యక్షత వహించారు. సభలో సిఐటియు కార్యదర్శి ఎన్ బాబురావు, కార్ స్టాండ్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్ ఆలీ, వెంకటేశ్వర్లు, ఆటో యూనియన్ నాయకులు అఖిల్, ఐఎల్టీడి ఫెడరేషన్ చీరాల బ్రాంచ్ కార్యదర్శి జి సుధాకర్, పఠాన్ కాలేష్, ఆటో యూనియన్ నాయకులు గాలి మోషే, యు చక్రపాణి పాల్గొన్నారు.